ఆంధ్రప్రదేశ్

తర్లుపాడులో ఘనంగా గురు దక్షిణ కార్యక్రమం

తర్లుపాడులో ఘనంగా గురు దక్షిణ కార్యక్రమం

గురుశిష్య సంబంధాలకు గుర్తుగా సంప్రదాయ కార్యక్రమం జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్. 17 మార్కాపురం జిల్లా తర్లుపాడు దసరా పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ అధ్యక్షులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు సూచన మేరకు తర్లుపాడు మండల కేంద్రంలో గురుదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు అనాదిగా గురువులను గౌరవిస్తూ వస్తున్న సంప్రదాయాన్ని గుర్తుచేస్తూ విద్యార్థులు ఇళ్లకు వెళ్లి అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలుఅంటూ పాటలు పాడారు. విద్యార్థులు గృహస్థుల వద్దకు వెళ్లగా వారు ఆప్యాయంగా ఆదరించి గురుదక్షిణ అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమం జవ్వాజి విజయభాస్కరరావు, బేడుదురు పుల్లయ్య, భవనం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు దాతలు గురుదక్షిణతో పాటు చిన్నారులకు చాక్లెట్లు, బిస్కెట్లు, పప్పులు, బొరుగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీ జగన్ బాబు, జె. జనార్దనరావు, జె. వెంకటేశ్వర్లు, జె. లక్ష్మీ వెంకట సత్యనారాయణ, జేవీ భాస్కరరావు, వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు సీహెచ్. రవికుమారి, కోటి మోహన్, సువర్ణ, కోలగట్ల కృష్ణారెడ్డి, కే. భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్