
జనం న్యూస్ అక్టోబర్19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పెద్దకోడేపాక గ్రామంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామంలోని ముసలమ్మకుంట వద్ద, శివాలయం వద్ద ఏర్పాటు చేసిన రెండు సెట్ల బతుకమ్మ విగ్రహాన్ని మండలంలోని పెద్ద కోడెపాక గ్రామంలో ఎస్ఎస్ సీ 2005–06 బ్యాచ్ సభ్యులు ఆవిష్కరించి గ్రామీణ సంస్కృతిని కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు సంప్రదాయాలను అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పుట్టి పెరిగిన ఊరి సంస్కృతి పరిరక్షణలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని, సహకరించిన గ్రామ పాలకవర్గానికి, పెద్దలకు కృతజ్ఞతలుతెలిపారు. బతుకమ్మ వేడుకలను మరింత ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో : గ్రామ సర్పంచ్ మంద దీన-ప్రభాకర్, ఉపసర్పంచ్ పైండ్ల సునీత-చంద్రమౌళి, వార్డు సభ్యులు చందా రఘు, కుక్కల గణేష్, రేణుకుంట్ల స్వాతి-పృథ్వీరాజ్, గోడిశాల లలిత- రాజేందర్, శివ సుమన్, గ్రామ శాఖ అధ్యక్షులు పల్లెబోయిన శ్రీనివాస్, కొగిల సుకుమార్, కొగిల అర్జున్, మాజీ సర్పంచ్ అబ్బు ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మాచర్ల మంగమ్మ-రవి, తడ్క కుమారస్వామి పాల్గొన్నారు. అలాగే ఎస్ఎస్సీ 2005–06 బ్యాచ్ సభ్యులు కొగిల తిరుపతి (ఎస్ఐ), కొగిల సుమన్, నాగెల్లి నాగరాజు, రంగు రాజేష్, దాసి శ్రావణ్ కుమార్, పాకాల అనంతరెడ్డి, మంద వెంకటేష్, రమేష్, నర్ర రమేష్, పైండ్ల భాను, వైనాల అశోక్, కుచన నరేష్, కొగిల పెద్ద సుమన్ తో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.