
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశంఅక్టోబర్ 21. 10. 2026జహీరాబాద్ నియోజకవర్గం జహీరాబాద్లో సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు నింపాలని, రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులు పాడిపంటలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం మరింత బలపడాలని, ప్రతి కుటుంబంలో విజయాలు చేకూరాలని చిట్టెంపల్లి బాలరాజు ఈ సందర్భంగా పేర్కొంటూ రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.
