

సేవా కార్యక్రమాలతో ప్రజల్లో గుర్తింపు.. మంచికి మారుపేరు, స్నేహశీలి, అందరివాడు
జనం న్యూస్ అక్టోబర్ 22: ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం
కాట్రేనికోన ఎంపీటీసీ-1 స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి చెందిన యువ నాయకుడు పి.ఎస్.ఎన్. రాజు అధికారికంగా ప్రకటించబడ్డారు. రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాజుకు అభ్యర్థిత్వం దక్కడంతో పార్టీ శ్రేణుల్లో సందడి నెలకొంది. మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, ఎన్నో కష్టనష్టాలను అధిగమిస్తూ అంచెలంచెలుగా ఎదిగిన రాజు ప్రజాసేవను తన లక్ష్యంగా చేసుకుని రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు, పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ముందుంటున్నారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, స్థానిక ప్రజాప్రతినిధులకు అందుబాటు లో ఉంటూ తన పరిధిలోని సమస్యల పరిష్కారానికి చొరవ చూపే నాయకుడిగా రాజుకు గుర్తింపు ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురి ప్రశంసలు పొందిన ఆయన ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని అనుచరులు అభిప్రాయపడుతున్నారు. స్నేహపూర్వక స్వభావం, అందరితో కలిసిమెలిసి ఉండే తత్వం, పార్టీ పట్ల నిబద్ధత తన రాజకీయ ప్రయాణంలో రాజుకు గుర్తింపు తీసుకొచ్చాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాట్రేనికోన ఎంపీటీసీ-1 అభ్యర్థిగా అవకాశం దక్కడంతో స్థానికంగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక గేట్ సెంటర్లో నామినేషన్ వెళ్లేముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు, అనంతరం పి.ఎస్.ఎన్. రాజు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నాగిడి నాగేశ్వరరావు, దాట్ల పవన్ , విత్తనాల బుజ్జి, గుంగుమళ్ల భద్రరావు, జనసేన పార్టీ నాయకుడు మోక బాల ప్రసాద్, బిజెపి గ్రంధి నానాజీ, పోలవరపు చంటి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు రంబాల చౌదరి బాబు, రంబాల రామారావు, మోక అప్పాజీ, రాజేశ్వరరావు, వంగా దుర్గ బాబు వత్సవాయి రవి, అధిక సంఖ్యలో కూటమి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.