

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం అక్టోబర్ 23. 10. 2026 జహీరాబాద్ నియోజకవర్గంలో విజయదశమి, దసరా పండుగను పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ ఆర్డీఓకు, తహసీల్దార్‌కు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయదశమి పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని, రైతులు పాడిపంటలతో అభివృద్ధి చెందాలని కోరుకున్నారు.