తెలంగాణ

కాంగ్రెస్‌ లో నా ప్రయాణం కొనసాగుతుంది సస్పెన్షన్ ఎత్తివేతపై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకుడు

కాంగ్రెస్‌ లో నా ప్రయాణం కొనసాగుతుంది సస్పెన్షన్ ఎత్తివేతపై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకుడు

పార్టీ సిద్ధాంతాలే ముఖ్యం.. కార్యకర్తల సంక్షేమమే నా లక్ష్యం

జనం న్యూస్ అక్టోబర్ 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ చర్యల కమిటీ తన వివరణను పరిశీలించి సస్పెన్షన్‌ను అధికారికంగా ఎత్తివేయడంతో కాంగ్రెస్ నాయకుడు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ తనకు రాజకీయంగా పునాది అని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా టీపీసీసీ నాయకత్వానికి, క్రమశిక్షణ చర్యల కమిటీ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవికి, కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ అనంతులకు, జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకత్వానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.పదవులు శాశ్వతం కాదు.. పార్టీ పట్ల నిబద్ధతే శాశ్వతంరాజకీయాల్లో పదవుల కంటే పార్టీ పట్ల నిబద్ధత, ప్రజలతో అనుబంధం, కార్యకర్తల అభిమానం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. తనను నమ్మి అండగా నిలిచిన కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.తన రాజకీయ ప్రస్థానం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కోసం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అధికారం కంటే కార్యకర్తల అభిమానం తనకు గొప్ప బలమని, పార్టీ సిద్ధాంతాలను గౌరవిస్తూ ముందుకు సాగుతానని తెలిపారు.పార్టీ విజయమే లక్ష్యంగా ముందడుగుపార్టీ క్రమశిక్షణకు కట్టుబడి, స్థానిక నాయకత్వం, జిల్లా కాంగ్రెస్ కమిటీతో సమన్వయంగా పనిచేస్తానని ఆయన వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.సస్పెన్షన్ ఎత్తివేతతో కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ ప్రయాణం మరింత ఉత్సాహంగా కొనసాగుతుందని, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.

ఇ-పేపర్