
రెస్క్యూ చర్యలకు పోలీస్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా
జనం న్యూస్ అక్టోబర్ 26 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాబోయే అర్నాబ్ తుఫాను తీవ్రత దృష్ట్యా జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. తీరప్రాంత, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పోలీస్ శాఖకు కీలక ఆదేశాలు రెస్క్యూ బృందాల మోహరింపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖలతో సమన్వయం చేసుకుంటూ పోలీస్ క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని తీరప్రాంత పెట్రోలింగ్ లోతట్టు, సముద్ర తీర గ్రామాల్లో నిరంతర పెట్రోలింగ్ నిర్వహించి, సహాయక చర్యలను వేగవంతం చేయాలనిసెలవులు రద్దు చేశారు. పునరావాస కేంద్రాల్లో స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన భోజనం తదితర సదుపాయాలు పక్కాగా అందేలా పర్యవేక్షించాలని వాతావరణం అనుకూలించే వరకు మత్స్యకారులు ఎట్టిపరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదని కోరారు.ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు ఈదురు గాలులు, భారీ వర్షాల సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కూలిపోయే ప్రమాదం ఉన్న చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు, శిథిలావస్థలో ఉన్న భవనాల కింద నిలబడ వద్దని తెగిపడిన విద్యుత్ వైర్లను ముట్టుకోవద్దని వెంటనే విద్యుత్ శాఖకు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని ఉధృతంగా ప్రవహించే వాగులు, కాజ్‌వేలు, వరద నీరు చేరిన రహదారులను దాటే సాహసం చేయరాదని
సరిపడా తాగునీరు, నిల్వ ఉండే ఆహారం, నిత్యావసర మందులు, టార్చ్‌లైట్లతో పాటు మొబైల్ ఫోన్లను ముందే ఫుల్ ఛార్జ్ చేసి ఉంచుకోవాలని అనధికారి సమాచారాన్ని, పుకార్లను నమ్మవద్దని కేవలం ప్రభుత్వం విడుదల చేసే అధికారిక హెచ్చరికలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వెంటనే దిగువ నంబర్లకు తక్షణమే తెలుపగలరని తెలిపారు. స్థానిక పోలీసులు గాని, పోలీస్ ఎమర్జెన్సీ: 112 / 100 ప్రజల రక్షణే ప్రథమ కర్తవ్యంగా పోలీస్ విభాగం నిరంతరం అందుబాటులో ఉంటుందని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు.//