
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం అక్టోబర్ 26. 10. 2026 జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండల పరిధిలోని ఏడాకులపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఉన్న సాయిబాబా ఆలయంలో యజ్ఞం పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. చిల్లమామిడి గ్రామానికి చెందిన బర్ల అంజన్న ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. యజ్ఞం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సాయిబాబా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి భావంతో నిర్వహించిన యజ్ఞం, పూజా కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సాయిబాబా భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.