
విరిగిపడిన చెట్టుకొమ్మల తొలగింపు.. డ్రైనేజీ ప్రధాన లైన్లకు మరమ్మతులు
జనం న్యూస్ అక్టోబర్ 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ వీధి లాస్ట్ గేట్ సమీపంలో గాలికి చెట్టుకొమ్మలు విరిగిపడి రోడ్డుకు అడ్డంగా పడటంతో స్థానికులు, వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని కాలనీవాసి లక్ష్మీనారాయణ రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి దృష్టికి ఫోన్ ద్వారా తీసుకెళ్లారు.వెంటనే స్పందించిన అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి మున్సిపల్ సిబ్బంది వెంకటమ్మతో పాటు లక్ష్మీనారాయణ, సతీష్, రామారావు, కల్యాణ్ తదితరులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అందరూ సమన్వయంతో రోడ్డుపై పడిన చెట్టుకొమ్మలను తొలగించి పక్కకు వేయడంతో రాకపోకలకు మార్గం సుగమమైంది. సమస్యను గుర్తించిన వెంటనే స్పందించి పరిష్కరించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.మూడు గంటల పాటు డ్రైనేజీ లైన్ల శుభ్రత ఇదిలా ఉండగా, గత నాలుగు రోజులుగా కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సమస్య తీవ్రతను గుర్తించిన అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి వెంటనే స్పందించి హైటెక్ యంత్రాన్ని రప్పించి డ్రైనేజీ ప్రధాన లైన్లను శుభ్రం చేయించారు. ఈ పనులు సుమారు మూడు గంటల పాటు కొనసాగాయి. అధ్యక్షులు జె. పురేందర్ రెడ్డి స్వయంగా దగ్గరుండి పనులను పర్యవేక్షించగా, లక్ష్మీనారాయణ, రామలింగం పంతులు తదితరులు సహకరించారు. డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు అసోసియేషన్ సభ్యులు చొరవ చూపడంపై కాలనీవాసులు సంతృప్తి వ్యక్తం చేశారు.కాలనీవాసులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం: అధ్యక్షులు పురేందర్ రెడ్డిఈ సందర్భంగా రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాలనీవాసులకు ఏ సమస్య ఎదురైనా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కాలనీలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపడతామని పేర్కొన్నారు.కాలనీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అసోసియేషన్ సభ్యులందరూ సమష్టిగా పనిచేస్తున్నారని తెలిపారు. కాలనీవాసులందరి సహకారం, సహాయ సహకారాలతో భవిష్యత్తులోనూ ప్రతి సమస్యను విజయవంతంగా పరిష్కరించేందుకు తమ అసోసియేషన్ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుకు సాగడం అభినందనీయం.