
జనం న్యూస్ అక్టోబర్ 29 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం జనగామ గ్రామంలో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సొసైటీ చైర్మన్ సుతారి రమేష్, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సొసైటీ చైర్మన్ సుతారి రమేష్, తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చి ప్రభుత్వ సదుపాయాలను వినియోగించుకోవాలని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు సుజావుగా జరిగేలా చూడాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగామ సర్పంచి మట్ట శ్రీనివాస్, మాజీ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎంపీపీ రవీందర్ రెడ్డి, పరుశురాం గౌడ్, అధికారులు రైతులు పాల్గొన్నారు.