
*జనం న్యూస్ అక్టోబర్ 31,వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం లోని, మహబూబ్ నగర్ జిల్లా, మహమ్మదాబాద్ మండలంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, మహమ్మదాబాద్ మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి గారు.ఈ సందర్భంగా రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే స్పందించి, మహమ్మదాబాద్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహ్మదాబాద్ మండలం రైతులు తదితరులు పాల్గొన్నారు.