
జనం న్యూస్ 31 అక్టోబర్ 2026(ఎల్కతుర్తి మండల్ బండి బకుమారస్వామి రీపోటర్ )హన్మకొండ జిల్లా, ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ సర్కిల్ వద్ద భారత మాజీ ప్రధాని, ఉక్కు మహిళ, దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన దివంగత శ్రీమతి ఇందిరాగాంధీ వర్థంతి సందర్భంగా ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశ ప్రధానిగా ఆమె అందించిన సేవలను, దేశ అభివృద్ధికి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలను, పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషిని నాయకులు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. దేశ రాజకీయాల్లో ఇందిరాగాంధీ పోషించిన కీలక పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్, సొసైటీ బ్యాంకు అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, గోళి రాజేశ్వర్ రావు సూరారం గ్రామశాఖ అధ్యక్షులు బచ్చు శ్రీదర్ రావు ఆంబాల శ్రీకాంత్,బక్కి ఎఎంసి డైరెక్టర్ గొడిశాల రాజయ్య, మండ సుమన్ గౌడ్,ఈరభీంరాజు బ్యాంకు డైరెక్టర్ తంగళ్లపెల్లి కొంరయ్య బొల్లెపోగు రమేష్ బాబు,శనిగరపు వెంకటేశ్ గొడిశాల అర్జున్ గౌడ్, కుర్ర ప్రకాశ్ గౌడ్, వల్లాభపూర్ గ్రామశాఖ అధ్యక్షులు గౌతమ్‌తో పాటు మండలంలోని వివిధ గ్రామశాఖల అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు