
జనం న్యూస్ నవంబర్ 02: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామ శివారులో ఉన్న స్మశాన వాటికకు విద్యుత్ లైన్, విద్యుత్ స్తంభాలు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి గ్రామ సర్పంచ్ భూషవేణి ప్రవీణ్ యాదవ్, ఉపసర్పంచ్ మూడ్ దయానంద్, వార్డు సభ్యులు సోమవారం కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్, ఉపసర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలోని స్మశాన వాటిక వద్ద విద్యుత్, నీటి సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రాలు అందజేశామని పేర్కొన్నారు. స్పందించిన కలెక్టర్ సంబంధిత జిల్లా, మండల అధికారులను క్షేత్రస్థాయికి పంపించి, స్మశాన వాటికకు విద్యుత్ లైన్, స్తంభాలు మంజూరు చేయించారని తెలిపారు. గ్రామ ప్రజల సమస్యను పరిష్కరించిన జిల్లా కలెక్టర్‌కు, సహకరించిన అధికారులకు సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, యువకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.