
జనం న్యూస్ నవంబర్ 3 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్ మంగళవారం కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, సిబ్బంది పనితీరును క్షేత్రస్థాయిలో సమీక్షించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డుల నిర్వహణ, వాటి పరిరక్షణ, అధికారుల విధుల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణకు చేపడుతున్న చర్యలను సమగ్రంగా పరిశీలించారు. విధుల నిర్వహణలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇచ్చే యజమానులు, తల్లిదండ్రులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిని ఉపేక్షించవద్దని అధికారులను ఆదేశించారు. రహదారి భద్రత విషయంలో రాజీ పడకుండా ట్రాఫిక్ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు.అనంతరం ట్రాఫిక్ నియంత్రణపై అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. కూకట్పల్లి పరిధిలోని ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను నిరంతరం పర్యవేక్షిస్తూ వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని తెలిపారు.ప్రజల భద్రతే ప్రాధాన్యంట్రాఫిక్ నియంత్రణ అనేది కేవలం జరిమానాల విధింపుకే పరిమితం కాకుండా, రహదారి ప్రమాదాల నివారణకు, ప్రజల ప్రాణాల రక్షణకు దోహదపడేలా ఉండాలని ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో డీసీపీ ట్రాఫిక్-2 శేషాద్రి రెడ్డి, ఐపీఎస్, ఏడీసీపీ ట్రాఫిక్-2 వీరన్న, కూకట్పల్లి ట్రాఫిక్ ఏసీపీ గిరిప్రసాద్, కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ తిమ్మప్పతో పాటు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.