
జనం న్యూస్ నవంబర్ 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ జీవీఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో అనకాపల్లి జోన్ లో జరిగిన ఆరు కార్పొరేటర్ల ఎన్నికలకు కూటమి తరపున పోటీ చేసిన తెలుగుదేశం జనసేన బిజెపి అభ్యర్థుల అఖండ విజయం శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ కే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జిల్లా మాజీ మీడియా కోఆర్డినేటర్ కొణతాల వెంకటరావు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. ఎన్నికల ప్రకటించిన దగ్గర నుండి కూటమి అభ్యర్థుల ఎంపిక ఎన్నికల ప్రణాళిక విధి విధానాలు బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకొని ప్రణాళిక బద్ధంగా వార్డులో కార్యాచరణ రూపొందించి నాయకులకు కార్యకర్తలకు కూటమి బాధ్యతలను సమిష్టింగా కలిసి తిరగాలని దిశా నిర్దేశం చేశారు. అలాగే శాసనసభ్యులు ప్రతి వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించడం వార్డులో పర్యవేక్షణ చేయడానికి సీనియర్ నాయకులను నియమించి ఇంటింటి ప్రచారంలో ఎన్నికల బాధ్యతలు వార్డు పరిధిలో నాయకులకు బాధ్యతలు అప్పగించడం, ఇంటింటి ప్రచారం చేయడం ఓటర్ లిస్టులు వెరిఫికేషన్ చేయడం ప్రతిరోజు బాధ్యులతో ముఖాముఖిగా సమావేశం నిర్వహించారని, వార్డుల్లో ఎన్నికల ప్రచార సభలను పార్లమెంట్ సభ్యులు సీఎం టిడిపి నియోజవర్గ ఇన్చార్జ్ పిలా గోవింద సత్యనారాయణ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు తో కలిసి ఓటర్లకు కూటమి అభ్యర్థులను గెలిపిస్తే వార్డులో కావలసిన మౌలిక సదుపాయాలు స్ట్రీట్ లైట్లు మంచినీరు, పారిశుద్ధ్యం కాలువలు సిమెంట్ రోడ్లు ఇప్పటికంటే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని కార్పొరేటర్లు గెలిచిన తర్వాత మీకు అందుబాటులో ఉంటారని శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఇన్చార్జి మాటలు నమ్మి ప్రజలు కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించారని వెంకటరావు అన్నారు. క్రిమినల్ ఆర్థిక ఉగ్రవాది రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్న వైసిపి అధినేత జగన్ రెడ్డి మాటలు చేష్టలు గత రెండున్నర సంవత్సరాలుగా గమనిస్తున్నారని అతని వింత పోకడలకు ప్రజలు ఓటర్లు అసహ్యించుకున్నారని అతను నిలబెట్టిన అభ్యర్థులను చిత్తుగా చిత్తుగా ఓడించారు. అనకాపల్లి పట్టణంలో వైసీపీ అభ్యర్థులు కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేసినప్పటికీ ఓటర్లు లో స్పందించలేదని, వెంకటరావు అన్నారు. శ్రీ భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్య ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ముగ్గురు మూడు పార్టీలను పారదర్శకంగా నిర్ణయాలు తీసుకొని ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని పిలుపును ఓటర్లు సానుకూలంగా స్పందించి వైసీపీకి బుద్ధి చెప్పారని సత్యనారాయణ అన్నారు. ఎన్నికలు ప్రకటించిన నాడునుండి వార్డు పర్యటనలో ప్రజల స్పందన చూసి కూటమి అభ్యర్థులు ఆరు వార్డుల్లో విజయం తర్జుమని పది రోజుల క్రితం పత్రికా ముఖంగా చేసిన ప్రకటన నిజమైందని వెంకటరావు సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో దూలం ప్రసాదు కాండ్రేగుల రవీంద్ర యలమంచిలి బంగారు రాజు పాల్గొన్నారు.