
జనం న్యూస్ 06/11/2026 తెలంగాణ రాష్ట్రంలోని బంజారా, ఆదివాసీ, గిరిజన సమాజం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం ఎంతో హర్షణీయమైన పరిణామం. బంజారా చిరకాల ఆకాంక్షను గుర్తించి, వారి హక్కుల పరిరక్షణకు ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు ముందడుగు వేసిన తెలంగాణ ప్రభుత్వానికి అఖిల భారత గిరిజన సమాఖ్య తరఫునుంచి ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఇప్పటివరకు ఉమ్మడి ఎస్సీ, ఎస్టీ కమిషన్ పరిధిలో ఉన్న బంజారా సమస్యలకు ప్రత్యేక గుర్తింపు, ప్రాధాన్యత కల్పించే దిశగా ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు నిర్ణయం ఒక చారిత్రాత్మక అడుగు. దీనివల్ల బంజారా పై జరుగుతున్న అన్యాయాలు, అటవీ హక్కులు, భూ సమస్యలు, విద్యా, ఉద్యోగ అవకాశాలు, రాజ్యాంగపరమైన హక్కుల ఉల్లంఘన వంటి సమస్యల పరిష్కారానికి మరింత బలమైన వేదిక ఏర్పడుతుందని ఆశిస్తున్నాము. బంజారాల అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ప్రత్యేక కమిషన్ ఎంతగానో దోహదపడుతుందని విశ్వసిస్తున్నాము. ఈ నిర్ణయం తెలంగాణలోని ఆదివాసీ, బంజారా, సహా అన్ని తెగలకు నూతన ఆశలు కల్పించింది. బంజారా సమాజం పట్ల సానుకూల దృక్పథంతో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా బంజారా సంక్షేమం, హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను మీ, వినయ్ పవర్ AITF తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్