
జనం న్యూస్ నంబర్ 7 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కేపీహెచ్బీ కాలనీ లో ప్రభుత్వం చేపడుతున్న స్థలాల వేలం పాటలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర జాయింట్ కమిటీ కన్వీనర్ మరియు కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ నాయకత్వంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రజా ప్రయోజనాలను పక్కనబెట్టి ప్రభుత్వ స్థలాలను వేలం వేయడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ మాట్లాడుతూ. స్థానిక ప్రజల అవసరాలకు కోసం సేకరించిన ఫిష్ మార్కెట్ పక్కన ఉన్నా స్థలం మరియు ట్రక్ పార్క్స్థ లాన్ని మరియు పబ్లిక్ పార్కులు, ఆసుపత్రులు, పాఠశాలలు, పెట్రోల్ బంక్ కి కేటాయించినటువంటి ప్రజా ఉపయోగకరమైన పనులకు వినియోగించాల్సిన స్థలాలను ప్రభుత్వం వేలం పేరిట విక్రయించడం సరికాదన్నారు. ప్రజా ఆస్తులను కాపాడటమే ధ్యేయంగా తమ పోరాటం కొనసాగుతుందని, వేలం ప్రక్రియను రద్దు చేసే వరకు నిరసనలు ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నిరసన ర్యాలీ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ మద్దతు తెలిపారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వేలం పాటల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో కాలనీ వాసులు మరియు కాలనీ సంఘాలతో కలిసి వేలం పాట ఆపుతామని, ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజక కో ఆర్డినేటర్లు కొల్లా శంకర్, వేముల మహేష్, బోగాది వెంకటేశ్వర్ రావు, నాగేంద్ర, పండుగ సూర్య, అశోక్ మాదాసు,డి.వెంకట్, శ్రీనివాస్ గోవింద్, అంజి, పవన్, ప్రసన్న ఆంజనేయులు, సుదర్శన్, రాము, ప్రసాద్ నాయుడు, మురళి, ప్రసాద్, శివశంకర్, శేకర్, గోపి, నీరజ్ తదితరులు పాల్గొన్నారు.