
జనం న్యూస్ నంబర్ 7 : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ పెబ్బేరు మండల్ తాటిపాముల గ్రామానికి చెందిన రాఘవేందర్ రెడ్డి కన్నస్వామి తన కుమారుడు విహాన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి దాతగా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం అందించడంతో పాటు, ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలనే సంకల్పంతో 50 స్టీల్ ప్లేట్లు, 50 స్టీల్ గ్లాసులను స్వాములకు అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్లాస్టిక్కు బదులుగా స్టీల్ వస్తువులను వినియోగించాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా చాటిచెప్పారు. ఈ సందర్భంగా దాత రాఘవేందర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులపై హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శ్రీ మిట్ట భక్తాంజనేయ అయ్యప్ప స్వామి సన్నిధానం నిర్వాహకులు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.