
కార్యక్రమంలో పాల్గొన్న చైర్ పర్సన్. బిచ్కుంద నవంబర్ 9 జనం న్యూస్కా మారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రం ఏళ్ల తరబడి సొంతింటి కోసం ఎదురుచూసిన నిరుపేద కుటుంబాల కల నెరవేరింది. కొత్త ఇంట్లో తొలి దీపావళి జరుపుకుంటున్న లబ్ధిదా రుల ఆనందంలో చైర్ పర్సన్ సీమ షేట్కార్ భాగస్వామయ్యారు. "మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి" కార్యక్రమంలో జాదవ్ మీరా బాయి కుటుంబాలతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి ప్రమిదలు వెలిగించి, మిఠాయిలు పంచుకున్నారు. వారి కుటుంబ పరిస్థితులు, పిల్లల చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. తమ కొత్త ఇంట్లో మున్సిపల్ చైర్ పర్సన్ సీమా షెట్కార్ స్వయంగా పండుగ జరుపుకోవడంతో లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంద ర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు కేవలం నాలుగు గోడలు మాత్రమే కాదని, పేదలకు ఆత్మగౌరవం, భద్రత, భరోసా కల్పించే చిరునామాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తోందన్నారు. ప్రజల ముఖాల్లో కనిపించే చిరునవ్వే ప్రభుత్వానికి అసలైన విజయమని పేర్కొన్నారు.