
జనం న్యూస్ సెప్టెంబర్ 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా.నివాళులర్పించారు అనంతరం తెలంగాణ ప్రాంత పద్మశాలి మండలం అధ్యక్షులు వంగరి సాంబయ్య మాట్లాడుతూ ఉద్యమ నేత స్వాతంత్ర సమరయోధుడు ఉద్యమాలే ఊపిరిగా పోరాటాల పరమపాదిగా బ్రతికిన దీశాలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసినారని తొలి తరం మలితరం తెలంగాణ కోసం నాయకత్వం వహించినారని అన్నారు 96 సంవత్సరాల వయసులో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చలిలో దీక్ష చేసిన గొప్ప మహానుభావుడు ప్రత్యేక తెలంగాణ సాధన కోసం అహర్నిశలు శ్రమించినారని భారతదేశం లో సహకార సంఘాల స్థాపనకు ఎంతో కృషిచేసి ప్రజలను సంఘటితంగా నడిపించినారని వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కోరారు భవిష్యత్తులో చట్టసభలలో పద్మశాలీల ప్రాతినిధ్యం ఉండాలని అందుకోసం మనమంతా ఐక్యతతో ముందుకు పోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్చే నేత సహకార సంఘం అధ్యక్షుడు బాసాని ప్రకాష్ శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి.జిల్లా కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాస్ దిడ్డి ప్రభాకర్ కొండ ముకుంద బూర లక్ష్మీనారాయణ దాసరి రమేష్ తుమ్మ ప్రభాకర్ బాసాని నవీన్ కోమటి రాజశేఖర్ గొట్టిముక్కుల రమేష్ మంత్రి రాజు , రంగు మహేందర్ పసునూటి తిరుపతి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.