
బాధిత కుటుంబానికి బియ్యం సహాయం !! జనం న్యూస్ 10 నవంబర్ మంగళవారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై రమేష్ సిద్ధిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం భూంపల్లి గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం వృద్ధాప్యం బాధతో చనిపోయిన కుర్మ కొత్త ఎల్లవ్వ కుటుంబాన్ని, బహుజన మిత్రుల ఆధ్వర్యంలో పరామర్శించడం జరిగింది. అలాగే వారి కుటుంబానికి చేయూతకోసం సహాయంగా 50 కిలోల బియ్యన్ని అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన మిత్రులతో పాటు బాధిత కుటుంబసభ్యులు ఉన్నారు.