
జనం న్యూస్ 10 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ప్ర తి ఎకరాకు రూ.50 వేల పంట నష్టపరిహారం చెల్లించాలి ప్రత్యేక కరువు పరిహార ప్యాకేజీ ప్రకటించాలి పెండింగ్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలి ఆరు నెలల పాటు ప్రజలకు ఉచిత నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి కేంద్ర ప్రభుత్వం పెంచిన అన్ని రకాల ధరలను తక్షణమే తగ్గించాలి కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా అదనపు కలెక్టర్ మధు మోహన్‌కు వినతిపత్రం అందజేత జోగులాంబ గద్వాల జిల్లాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులతో రైతులు వ్యవసాయ కార్మికులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ నాయకులు విమర్శించారు. ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు రైతులను ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పరిహార ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జోగులాంబ గద్వాల జిల్లా సమితి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జిల్లా కార్యదర్శి బి. అంజనేయులు నాయకత్వం వహించగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రెవెన్యూ అదనపు కలెక్టర్ మధు మోహన్ గారికి వినతిపత్రం అందజేశారు.ప్రతి ఎకరాకు రూ.50 వేల పంట నష్టపరిహారం చెల్లించాలి వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ. 50 వేల చొప్పున పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులకు పంటలు చేతికందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాని దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. పంట నష్టాలను తక్షణమే క్షేత్రస్థాయిలో అంచనా వేసి అర్హులైన రైతులందరికీ పరిహారం అందించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రత్యేక కరువు పరిహార ప్యాకేజీ ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి
జోగులాంబ గద్వాల జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. నడిగడ్డ ప్రాంత రైతులకు సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టులు ఏళ్ల తరబడి పూర్తికాకపోవడం వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం కలిగిస్తోందని విమర్శించారు. ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి పనులను వేగవంతం చేయాలని కోరారు. రైతులకు శాశ్వత సాగునీటి పరిష్కారం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని స్పష్టం చేశారు. ధరలు తగ్గించాలి ఆరు నెలల పాటు ఉచిత నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి గత ఎనిమిదేళ్లుగా పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కరువు, పంట నష్టాలు, ఉపాధి లేకపోవడంతో ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరు నెలల పాటు ప్రతి పేద కుటుంబానికి బియ్యం పప్పులు నూనె తదితర నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
రైతులు ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటంప్రభుత్వాలు ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి కరువు పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహించి రైతులు వ్యవసాయ కార్మికులు పేద ప్రజలను ఆదుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. కేవలం ప్రకటనలు, హామీలతో సమస్యలు పరిష్కారం కావని, తక్షణమే ప్రత్యేక కరువు పరిహార ప్యాకేజీ ప్రకటించి అమలు చేయాలని స్పష్టం చేశారు. రైతులకు ప్రజలకు న్యాయం జరిగే వరకు సీపీఐ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు, పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జి రంగన్న, ఆశన్న, ఏ నాగార్జున, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు భరత్, ప్రవీణ్, సిపిఐ జిల్లా సమీపంలో వెంకట రాములు, సిపిఐ గద్వాల మండలం నాయకులు నారాయణ వెంకట రాములు ఏఐటీయూసీ జిల్లా నాయకులు ప్రభుదాసు ,తిమ్మప్ప ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సురేందర్ ,శివ, ఏఐవైఎఫ్ నాయకులు వెంకటేశు, రఘురెడ్డి, కార్మిక సంఘం నాయకులు అనోక్, సవరన్న. ఉపేంద్ర, తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాభివందనములతో బి. అంజనేయులు జిల్లా కార్యదర్శి భారత కమ్యూనిస్టు పార్టీ (సి పి ఐ ) జోగులాంబ గద్వాల జిల్లా సమితి.