
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు 11-11-2026 పట్టణంలో నవంబర్ 16వ తేదీన నిర్వహించనున్న పడిపూజ మహోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు వచ్చిన మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్‌ను మిట్ట హనుమాన్ అయ్యప్ప సన్నిధానం సభ్యులు ఘనంగా సన్మానించారు. మేకల ఎల్లయ్య గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిట్ట హనుమాన్ అయ్యప్ప సన్నిధానం సభ్యుల ఆహ్వానం మేరకు విచ్చేసిన మున్సిపల్ చైర్మన్‌కు సభ్యులు శాలువాతో సత్కరించి గౌరవించారు. ఈ సందర్భంగా నవంబర్ 16న నిర్వహించనున్న పడిపూజ మహోత్సవానికి భక్తులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అక్కి శ్రీనివాస్ గౌడ్ కోరారు.