
జనం న్యూస్ నవంబర్ 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన పెంబర్తి మొగిలి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ, ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు వారికి మనోధైర్యం కల్పించారు. అనంతరం నిమ్స్ డైరెక్టర్‌తో మాట్లాడి బాధిత కుటుంబం చెల్లించాల్సిన మొత్తం ఆసుపత్రి బిల్లును మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొత్తగట్టు సాయి తదితరులు పాల్గొన్నారు.