
జనం న్యూస్ నవంబర్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ జీవీఎంసీ మేయర్ గా ఎన్నికైన శ్రావణి కు అభినందనలు తెలియజేయడానికి ఈరోజు ఉదయం విశాఖపట్నంలో వారి స్వగృహంలో 107 వ వార్డు కార్పొరేటర్ గా ఎన్నికైన మాదంశెట్టి చిన్న తల్లి నీలబాబు కలుసుకొని పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్న తల్లి నీలబాబు మాట్లాడుతూ గత పాలకవర్గంలో మీతో పాటు కార్పొరేటర్ గా పనిచేశామని, ఇప్పుడు మీరు మేయర్ గా ఎన్నికైనందుకు చాలా ఆనందంగా ఉందని, బాధ్యతలు చేపట్టిన తర్వాత మా వార్డుకు పర్యటించి ప్రజా సమస్యలపై మీ వంతు సహకారం అందించాలని, గత పాలకవర్గంలో 50 కోట్లతో 84 వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాప్రతినిధులు సహకారంతో చేశామని, మీ హయాంలో కూడా మా వార్డు అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని చిన్నతల్లి నీలబాబు కోరారు.