

ముత్యాల సునీల్ రెడ్డికి కాలనీవాసులు, యాదవ సంఘం కృతజ్ఞతలు
జనం న్యూస్ నవంబర్ 11: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామ ఒడ్డెర కాలనీలో, మల్లన్న దేవాలయం వద్ద బుధవారం హైమాస్ట్ దీపాలను ఏర్పాటు చేశారు. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కాలనీవాసులు, యాదవ సంఘం సభ్యులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో రాత్రి వేళల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ వెలుగుల సౌకర్యం కల్పించేందుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శివకుమార్, మాజీ అధ్యక్షుడు దేవారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాప్రసాద్, సొసైటీ ఇంచార్జి అధ్యక్షుడు జీకే శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు దిబ్బ శ్రీనివాస్, క్యాతం నవీన్, గుండేటి చంద్రశేఖర్, రాంపల్లి గంగాధర్, రాజారాం సుదర్శన్, నాయకులు, కార్యకర్తలు, దేవాలయ కమిటీ అధ్యక్షులు బీమానావోయినా పెద్ద బావులు, సంఘ అధ్యక్షుడు వేముల మహేందర్, పిప్పేరావోయినా అశోక్ యాదవ సంఘం సభ్యులు మరియు ఒడ్డెర కాలనీ సభ్యులు పాల్గొన్నారు.