
జనం న్యూస్ నవంబర్ 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కుండలేశ్వరం, నడవపల్లి ఎంపీటీసీ స్థానంలో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి 678 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన జనసేన నేత గిడ్డి రత్నశ్రీకి ఘన సన్మానం లభించింది. ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఓగూరి భాగ్యశ్రీ, మండల అధ్యక్షులు మోకా బాలప్రసాద్, భీమ్లా సూర్యనాయుడు ఆమెను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ విజయం కూటమి ఐక్యతకు, ప్రజల నమ్మకానికి నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. గిడ్డి వారి కుటుంబం నుంచి గెలిచి ప్రజల ఆశీర్వాదం పొందడం తన అదృష్టమని రత్నశ్రీ అన్నారు. తన విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రెండు గ్రామాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని హామీ ఇచ్చారు.