
జనం న్యూస్ 16 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్జో గులాంబ గద్వాల జిల్లా సమీకృత జిల్లా కోర్టు సముదాయం నిర్మాణానికి సంబంధించి పూడూరు గ్రామం, సర్వే నం.368లో ఇప్పటికే కేటాయించి, స్వాధీనం అప్పగించిన ప్రభుత్వ భూమిలో నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై దాఖలైన .27 2026 విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పిటిషనర్ కె. షఫీయుల్లా పూజారి శ్రీలేఖ న్యాయవాది. దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ప్రధానంగా నాలుగు అంశాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పూడూరు సర్వే నం.368లో మంజూరైన స్థలంలో సమీకృత జిల్లా కోర్టు సముదాయం నిర్మాణాన్ని ప్రారంభించడం.నిర్ణీత కాలపరిమితిలో నిర్మాణాన్ని పూర్తి చేయడం అప్పటివరకు ప్రస్తుత కోర్టు ప్రాంగణంలో తాత్కాలిక మౌలిక సదుపాయాలు కల్పించడం. మహిళా న్యాయవాదులు, కక్షిదారులు, సిబ్బంది మరియు దివ్యాంగులకు గౌరవప్రదమైన న్యాయప్రవేశం కల్పించేలా అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయడం.హైకోర్టు ధర్మాసనం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి. సమ్ కోశి మరియు న్యాయమూర్తి జస్టిస్ సుద్దాల చలపతి రావు తో కూడిన ధర్మాసనం ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించింది.పిటిషనర్ తరఫున: పూజారి శ్రీలేఖ, పూజారి శ్రీనిత పూజారి శ్రీధర్, న్యాయవాదులు ప్రభుత్వం ఇప్పటికే స్థలాన్ని కేటాయించి, భూమిని అప్పగించి, నిర్మాణానికి అవసరమైన పరిపాలనా ప్రక్రియలను చేపట్టిన నేపథ్యంలో పూడూరు స్థలంలోనే సమీకృత జిల్లా కోర్టు సముదాయం నిర్మాణం జరగాలన్న అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.న్యాయవ్యవస్థకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది కేవలం భవన నిర్మాణం మాత్రమే కాదు న్యాయవాదులు, కక్షిదారులు మరియు ప్రజలకు గౌరవప్రదమైన న్యాయప్రవేశాన్ని కల్పించే రాజ్యాంగబద్ధమైన బాధ్యత సత్యాస్ లా – ఆధారాలతో వాస్తవాలు. న్యాయమే మార్గం!