
జనం న్యూస్ 16/11/2026 *ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్ * *మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్ * జహీరాబాద్/పస్తపూర్ లోని S.V. ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన జహీరాబాద్ మండలానికి మరియు పట్టణానికి కొత్తగా మంజూరైన నూతన పెన్షన్ పత్రాలను మరియు స్మార్ట్ రేషన్ కార్డులను *మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్ * లబ్దిదారులకు పంపిణీ చేశారు.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ *ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి * నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ ఛైర్మెన్ గిరిధర్ రెడ్డి , ,మునిసిపల్ ఛైర్మెన్ యూనుస్ , వైస్ చైర్మన్, పట్టణ & మండలాల అధ్యక్షులు,మహిళ కాంగ్రెస్ అధ్యక్షులు,కౌన్సిలర్లు, కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.