
జనం న్యూస్ 16 నవంబర్ సోమవారం సిద్దిపేట నియోజికవర్గ ఇంచార్జి వై.రమేష్ సిద్దిపేట లయన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈరోజు బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంక్ ప్రాంగణంలో ఉచిత డయాబెటిస్ పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శిబిరానికి వచ్చిన వారికి ఉచితంగా డయాబెటిస్ పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు లగిశెట్టి నరసింహులు, కార్యదర్శి శ్రీధర్, కోశాధికారి బాసంగారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం – ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి అనే సందేశాన్ని ఈ శిబిరం ద్వారా అందించారు.