
ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ రూ.50 లక్షల నిధుల మంజూరుతో ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రత్యేక పూజలు జనం న్యూస్ నవంబర్ 16 :నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో కొలువైన శ్రీ మల్లన్న దేవస్థాన అభివృద్ధికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనుల కోసం రూ.50 లక్షల నిధులు మంజూరు చేయించడంతో సోమవారం ఆలయ ప్రాంగణంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముందుగా ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శ్రీ మల్లన్న స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తయి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. అనంతరం యాదవ సంఘం సభ్యులతో ఎమ్మెల్యే ఆత్మీయంగా సమావేశమై మాట్లాడారు. ఈ సందర్భంగా యాదవ సంఘం సభ్యులు, ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ.. శ్రీ మల్లన్న దేవస్థాన అభివృద్ధికి అవసరమైన రూ.50 లక్షల నిధులు మంజూరు చేయించడంలో ప్రత్యేక చొరవ తీసుకున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. తమ గ్రామ ఆలయ అభివృద్ధికి సహకరించినందుకు ఆయనకు కృతజ్ఞతాభావం వ్యక్తం చేశారు. అనంతరం యాదవ సంఘం సభ్యులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంతో తాళ్లరాంపహాడ్ గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఆలయ అభివృద్ధికి నిధులు సమకూరడంతో గ్రామస్తులు, యాదవ సంఘం సభ్యులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజా పూర్ణానందo, తాజా మాజీ జడ్పీటీసీ గుళ్ల రాజేశ్వర్, మండల నాయకులు జక్కనీ మధుసూదన్, తాళ్ళ రాంపూర్ గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు