వైరల్ వార్తలు

అర్హులైన దివ్యాంగులందరికీ సదరం ద్రవపత్రాలు.

అర్హులైన దివ్యాంగులందరికీ సదరం ద్రవపత్రాలు.

జనం న్యూస్ 22 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ది వ్యాంగుల ధ్రువీకరణకీ ప్రత్యేక వైద్య శిబిరం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. అర్హులైన దివ్యాంగులకు సదరం ధ్రువపత్రాలు మంజూరు చేసేందుకు, ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారంతో మంగళవారం గద్వాలలోని జిల్లా మహిళా సమాఖ్య కార్యాలయం వద్ద మానసిక సమస్యలున్న దివ్యాంగులకు నిర్వహిస్తున్న ప్రత్యేక మెగా సదరం శిబిరంను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అక్కడి వైద్యులు, అధికారులతో మాట్లాడి తగు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ మానసిక వైకల్యంకు సంబంధించిన కేసులను ప్రత్యేకంగా మానసిక వైద్య నిపుణులు పరీక్షించి, సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. మానసిక వైకల్యానికి సంబంధం లేని ఇతర వైద్య సమస్యలతో వచ్చిన వారిని జనరల్ మెడిసిన్ విభాగానికి రిఫర్ చేసి, సంబంధిత వైద్యులు పరీక్షించి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. పక్షవాతం, ఇతర శారీరక అనారోగ్యాలు వంటి సమస్యలకు మానసిక వైకల్య ధ్రువీకరణ ఇవ్వడం సాధ్యం కాదని, అటువంటి వారు సంబంధిత వైద్య విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. ప్రతి కేసును సంబంధిత వైద్యులు పూర్తిగా పరిశీలించిన అనంతరం మాత్రమే ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారని తెలిపారు. శిబిరానికి వచ్చిన దివ్యాంగులకు టోకెన్ నంబర్లు కేటాయించి, సీరియల్ నంబర్ ప్రకారం లోపలికి పంపించి వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. శిబిరంలో అందుబాటులో ఉన్న స్లాట్లకు అనుగుణంగా లబ్ధిదారులను క్రమబద్ధీకరిస్తూ, రద్దీ లేకుండా ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశామన్నారు. శిబిరం వద్ద అనవసరమైన రద్దీ లేకుండా, మానసిక వైకల్యానికి సంబంధించిన వారు మాత్రమే సంబంధిత విభాగంలో నమోదు చేసుకునేలా సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. ముందుగా ఫ్లాట్ బుక్ చేసుకున్న 92 మంది దివ్యాంగుల్లో 58 మంది చిన్నారులు ఉన్నారని ఈనెల 23వ తేదీన కూడా శిబిరం ఉంటుందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.ఈ పర్యటనలో డిఆర్డిఓ ముషాహిదా బేగం, డిపిఎం అరుణ, ఏపిఎం భీమన్న, డా.హేమలత, డా.ప్రదీప్, తదితరులున్నారు.

ఇ-పేపర్