
జనం న్యూస్, 17 నవంబర్, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం,సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండల పరిధిలోని, కొల్లూరు గ్రామంలో, మంగలి లక్ష్మి రమేష్ దంపతులకు, మంజూరైన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం సోమవారం ఘనంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలలను నిజం చేస్తూ అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా వీరికి ఇల్లు మంజూరైంది. ప్రభుత్వ సహాయంతో, సొంత శ్రమతో, నిర్మించుకున్న నూతన గృహం లోకి దంపతులు పూజలు, వేదమంత్రాలనడుమ గృహప్రవేశం చేశారు. ఉదయము నుండే, ఇంటిని పూలతో, మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. పురోహితులు గృహప్రవేశ పూజలుచేసి, హోమం నిర్వహించారు. ఈగృహప్రవేశ కార్యక్రమానికి, ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు, హనుమంతరావు పాటిల్, ఝరాసంగం మండల పరిధిలోని ఆయా గ్రామాల సర్పంచులు, బంధువులు, గ్రామస్తులు పాల్గొని దంపతులకు శుభాకాంక్షలు తెలిపి, నూతన గృహంలోకి తీసుకెళ్లారు. ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా, తమకు పక్క ఇల్లు ఇచ్చినందుకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలు హనుమంతరావు పటేల్ గారికి, మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులకు, గ్రామ పెద్దలకు, బంధువులకు అందరికీ లక్ష్మీ రమేష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చింతల గట్టు శివరాజు, పంచాయతీ కార్యదర్శి రవి, గ్రామ పెద్దలు,పార్టీ నాయకులు, మండల పరిధిలోని ఆయా గ్రామాల సర్పంచులు, బంధుమిత్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.