
జనం న్యూస్ సెప్టెంబర్ 22 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గం దినబంధు కాలనీలో నివాసం ఉంటున్న నర్సింగ్‌రావు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ, ప్రతిరోజూ సైకిల్‌పై ఉద్యోగానికి వెళ్తూ తన జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. అయితే వారం రోజుల క్రితం ఆయనకు ఎంతో అవసరమైన సైకిల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. నర్సింగ్‌రావు తన మిత్రుడి సూచన మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ని కలిసి తన పరిస్థితిని వివరించారు. నర్సింగ్‌రావు బాధను అర్థం చేసుకున్న రాజేశ్వరరావు వెంటనే స్పందించి, ఆయన జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా కొత్త సైకిల్‌ను సమకూర్చి అందించారు. కొత్త సైకిల్ అందుకున్న నర్సింగ్‌రావు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కృతజ్ఞతాభావంతో ఈరోజు రాజేశ్వరరావు నివాసానికి తన కొత్త సైకిల్‌తో వచ్చి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఇది కేవలం సైకిల్ కాదు.. ఇదే నా జీవనాధారం అంటూ తన కృతజ్ఞతను వ్యక్తం చేశారు. అంతేకాకుండా, తనకు కొత్త సైకిల్ అందించినందుకు గుర్తుగా, మొదటగా మీరే ఈ సైకిల్ నడిపి ప్రారంభించాలని నర్సింగ్‌రావు రాజేశ్వరరావు ని కోరారు. ఆయన కోరిక మేరకు వడ్డేపల్లి రాజేశ్వరరావు స్వయంగా సైకిల్ తొక్కి ప్రారంభించారు.