
జనం న్యూస్ 18 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్జో గులాంబ గద్వాల్ జిల్లా సింధనూరు గ్రామ కూలీలకు 125 రోజుల పని కల్పించాలి కూలి రేట్లు పెంచాలి సింధనూరు గ్రామంలో వి బి జీ గ్రాం జీ ఉపాధి పథకం కింద కూలీలకు సంవత్సరానికి 125 రోజుల పని కల్పించడంతో పాటు రోజువారీ కూలి రేటును పెంచాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది గ్రామంలోని చెరువులు, వంకలు కాలువలు పొలాల బాటలు గ్రామీణ రహదారులు తదితర అభివృద్ధి పనులను చేపట్టి కూలీలందరికీ ఉపాధి కల్పించాలి. కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు గుర్తించి పరిష్కరించాలి ముఖ్యంగా పని ప్రదేశాల్లో కూలీలకు తాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలి. సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కూలీలకు న్యాయం చేయాలని కోరుతున్నాము పేద కూలీలకు ఉపాధి భరోసా కల్పించాలి శ్రమకు తగిన గౌరవం గిట్టుబాటు కూలి అందించాలి కూలీల పక్షాన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజా పోరాటం సింధనూర్ ఉప్పరి గంగాధర్జో గులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బసవ స్వామి మండల ఉపాధ్యక్షుడు భీమేష్ తిరుమలేష్ నాయుడు