
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ 18-11-2026 బుధవారం వనపర్తి జిల్లా పరిధిలో ధూపదీప నైవేద్య పథకం కింద కొనసాగుతున్న దేవాలయాలను దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీమతి వెంకటేశ్వరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆలయాల్లో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలు, ధూపదీప నైవేద్యాల అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఆలయంలో ప్రతిరోజూ నిత్యం ధూపదీప నైవేద్య కార్యక్రమాలు తప్పనిసరిగా నిర్వహించాలని అర్చకులకు సూచించారు. భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు అనుగుణంగా ఆలయాల్లో పూజా కార్యక్రమాలు క్రమం తప్పకుండా కొనసాగించాలని తెలిపారు. ఈ తనిఖీ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి.వి. లక్ష్మీకాంతాచార్యులు పాల్గొన్నారు.