
జనం న్యూస్ నవంబర్ 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం ఖైతలాపూర్ డివిజన్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు, మిత్రులు కృష్ణ యాదవ్ ఆహ్వానం మేరకు ఈరోజు నిర్వహించిన వారి నూతన గృహప్రవేశ వేడుకకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు (గురుస్వామి) హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన గృహంలో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం కృష్ణ యాదవ్ కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించి, నూతన గృహంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని, ఆ కుటుంబం సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగింది.