
విద్యార్థులకు గుర్తింపు కార్డులు అందజేసిన లక్నాపూర్ శ్రీనివాస్జ నం న్యూస్ 19 నవంబర్ :- వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు, స్వేరోస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్నాపూర్ శ్రీనివాస్ విద్యార్థులకు గుర్తింపు కార్డులను అందజేశారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, బాధ్యతాయుత భావన పెంపొందించే లక్ష్యంతో ఈ కార్డులు పంపిణీ చేసినట్లు తెలిపారు. జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఒకరోజు పాటు వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ప్రధానోపాధ్యాయుడిగా వికాస్, ఏఏపీసీ చైర్మన్గా ఆదిత్య, ఎంఈఓగా శివకుమార్, డీఈఓగా మనోజ్ కుమార్, కలెక్టర్గా పవన్ కుమార్, విద్యాశాఖ మంత్రిగా అఖిలేష్ వ్యవహరించారు. పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అంజయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు భవిష్యత్తులో ఏ రంగంలోనైనా నిష్ణాతులుగా ఎదగాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. సర్పంచ్ పోనిమోని మాణిక్యం, ఏఏపీసీ చైర్పర్సన్ అనిత రాణి మాట్లాడుతూ.. స్వీయ క్రమశిక్షణతో విద్య, పరిజ్ఞానం పెంపొందించుకుని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడేలా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బుద్ధదేవ్, ఎంఈఓ అంజయ్య, సర్పంచ్ పోనిమోని మాణిక్యం, చైర్పర్సన్ అనిత రాణి, సీనియర్ ఉపాధ్యాయులు శరత్ బాబు, చంద్రశేఖర్, ఉపాధ్యాయులు లక్నాపూర్ శ్రీనివాస్, మధుసూదన్ రావు, షేక్ సాదిక్, కవిత, కరుణాకర్, ఎంఆర్సీ శ్రీశైలం యాదవ్, ఓఎస్ అనసూయ, ఛాత్రోపాధ్యాయులు ఉదయ్, నరసింహ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.