
జనం న్యూస్ మహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో ఇంచార్జ్,, తేదీ19/11/2026 తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆశయం మేరకు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి , పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ , మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో అర్హులైన ఒంటరి మహిళలకు చేయూత పింఛన్లు అందజేయడం జరిగింది. ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడం, వారు ఆత్మగౌరవంతో జీవించేలా సహకరించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి అర్హురాలికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరాలని, సంక్షేమ ఫలాలు అవసరమైన ప్రతి కుటుంబానికి అందాలని ఆకాంక్షిస్తున్నాను. ఇట్లు, కేతావత్ వెంకటేష్17వ వార్డు కౌన్సిలర్ఇస్నాపూర్ మున్సిపాలిటీ.