
జనం న్యూస్ 19 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ఆ లంపూర్ నియోజకవర్గం తెలంగాణలో లేదా కర్నూలులోనే ఎందుకు కార్యక్రమం తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు సింధనూర్ గంగాధర్ జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గానికి చెందిన అయిజ మున్సిపాలిటీ అయిజ మండల లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు చల్లా కాంపౌండ్లో నిర్వహించడం ఎంతవరకు సమంజసం పేద మధ్యతరగతి కుటుంబాలు ఇప్పటికే వైద్య ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అలాంటి లబ్ధిదారులను మరో రాష్ట్రానికి పిలిపించడం వల్ల అదనపు ప్రయాణ ఖర్చులు, సమయభారం పడే అవకాశం ఉంది.మా ప్రశ్నలు ఎమ్మెల్యే విజయుడు తెలంగాణ నియోజకవర్గంలోనే చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడానికి అభ్యంతరం ఏమిటి అయిజ లేదా ఆలంపూర్లోనే కార్యక్రమం నిర్వహించలేరా లబ్ధిదారుల సౌకర్యం కంటే రాజకీయ కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారా మా డిమాండ్: సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేద ప్రజలకు అందించే ఆర్థిక భరోసా. దానిని రాజకీయ ప్రచార కార్యక్రమంగా కాకుండా లబ్ధిదారుల సౌకర్యం దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలోనే పంపిణీ చేయాలి.ప్రజలకు సాయం అందించడమే ముఖ్యం వారికి ఇబ్బందులు కలిగించడం కాదు ఇట్లు: సింధనూర్ ఉప్పరి గంగాధర్జో గులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ