
జనం న్యూస్ నవంబర్ 19:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం :మాజీ ప్రధానమంత్రి, దివంగత ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలను గురువారం ఏర్గట్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పేదల అభ్యున్నతి కోసం ఆమె ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివనోళ్ల శివకుమార్, మాజీ మండల అధ్యక్షులు దేవారెడ్డి, నర్సారెడ్డి, జీవన్ రెడ్డి, సర్పంచ్ సంజీవ్ యాదవ్, షేక్ జాకీర్, బద్దం లింగారెడ్డి, ముసుకు మోహన్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయరెడ్డి, భూక్య నందు, ఎస్కే రషీద్, ఓర్స్ రాములు, ప్రభాకర్, సాయి, ఇబ్రపట్నం నరసయ్య, రేండ్ల రాయరెడ్డి, అనిల్ యాదవ్, మహబూబ్ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.