
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు 20-11-2026 శుక్రవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పర్సనల్ సెక్రెటరీ కల్వకోలి బుచ్చయ్యనాయుడు కుమార్తె మాధవి, అనిల్ కుమార్ల వివాహ వేడుక శుక్రవారం ఘనంగా జరిగింది. వనపర్తి పట్టణంలోని రాజనగరం రోడ్లో గల శ్రీ లక్ష్మీ కృష్ణ గార్డెన్స్‌లో నిర్వహించిన ఈ వేడుకకు పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు._ ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే పీఏ బుచ్చయ్యనాయుడు కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు వెంకటేష్ సాగర్, సురేందర్ గౌడ్, రంజిత్ కుమార్, రణధీర్ రెడ్డి, షబ్బీర్ పాల్గొన్నారు.