
జనం న్యూస్ నవంబర్ 20 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి నాగార్జునసాగర్ రోడ్డులోని జి.ఎస్.ఆర్, ఎస్.పి.ఆర్ శ్రీరస్తు కన్వెన్షన్ హాల్స్‌లో నిర్వహించిన వివాహ వేడుకకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, గురుస్వామి వడ్డేపల్లి రాజేశ్వరరావు హాజరయ్యారు. మిత్రులు జి. భాస్కరరావు, ఎం. పాండురంగారావు ఆహ్వానం మేరకు వివాహ వేడుకకు విచ్చేసిన ఆయన నూతన వధూవరులను అభినందించి ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. తమ ఆహ్వానాన్ని మన్నించి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వడ్డేపల్లి రాజేశ్వరరావు గురుస్వామికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.