
జనం న్యూస్ నవంబర్ 20 వరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ. పోలవరం మండల జడ్పీటీసీ సభ్యురాలిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన బీర సత్యకుమారిని ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఘనంగా సన్మానించి అభినందించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐ. పోలవరం మండలం నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన బీర సత్యకుమారిని ముమ్మిడివరంలోని శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐ. పోలవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాగిరాజ సూరిబాబు రాజు, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బీర సత్యకుమారికి అభినందనలు తెలియజేశారు.