
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం సెప్టెంబర్ 22. 09. 2026 కోహీర్ మండలం, గోద్గర్పల్లి: కోహీర్ మండలం గోద్గర్పల్లి గ్రామంలో యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని మాజీ తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై. నరోత్తం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుని ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న గ్రామ యువతను నరోత్తం అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ *తూకన్నా, మల్లేష్, శ్రీనివాస్, జైపాల్, ఆగమయ్య, సుభాష్, అంజన్న, రాములు, ఉప సర్పంచ్ *మారుతితో పాటు గ్రామ యువత పాల్గొన్నారు.