
జనం న్యూస్ నవంబర్ 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్లోని శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం వెనుక రోడ్డుపై డ్రైనేజీ మురుగునీరు ప్రవహిస్తూ కాలనీవాసులకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించారు. నిన్న రోడ్డుపై మురుగునీరు ప్రవహించడంతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు స్పందించి, ఈరోజు డ్రైనేజీని శుభ్రం చేయించి సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాలనీలో నెలకొన్న సమస్యను తక్షణమే పరిష్కరించిన మెట్రో వాటర్ వర్క్స్ అధికారులకు, డ్రైనేజీ శుభ్రత పనులు చేపట్టిన కార్మికులకు ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. కాలనీవాసులకు ఏ సమస్య ఎదురైనా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారుల సహకారంతో వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాలనీ అభివృద్ధి, పరిశుభ్రత, ప్రజల సంక్షేమమే వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.