
ఐదేళ్లలోపు పిల్లలందరూ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి జనం న్యూస్ – నవంబర్ 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి మూసాపేట్‌లోని భారత్‌నగర్‌కు చెందిన అభిలాష్ యాదవ్ ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అనంతరం అభిలాష్ యాదవ్ మాట్లాడుతూ ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో నిర్లక్ష్యం వహించకుండా, ప్రభుత్వం నిర్వహిస్తున్న పోలియో నివారణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందినప్పుడే పోలియో రహిత సమాజ లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లిదండ్రులతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. పోలియో నివారణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్న వైద్య సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు.