
జనం న్యూస్ నవంబర్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ మామిడి అశోక్కా ర్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు ఈ సందర్భంగా గ్రామంలోని ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప అలువల భాస్కర్ వైద్య ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.