
జనం న్యూస్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్ష జనం న్యూస్ 24 నవంబర్ వికారాబాద్ జిల్లా :- శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ప్రజలందరికీ, జనం న్యూస్ కుటుంబ సభ్యులందరికీ జనం న్యూస్ వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టత కలిగిన కార్తీక మాసం ఆధ్యాత్మిక చింతనకు, దైవారాధనకు అత్యంత ప్రత్యేకమైనదని ఆయన పేర్కొన్నారు. ఈ మాసంలో భక్తులు పరమశివుడు, శ్రీమహావిష్ణువులను భక్తిశ్రద్ధలతో పూజిస్తూ కార్తీక దీపారాధనలు, ఆలయ దర్శనాలు, దైవనామస్మరణ చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారని తెలిపారు. ఈ పవిత్ర మాసం ప్రతి ఒక్కరిలో భక్తి, విశ్వాసాలతో పాటు సేవాభావం, మానవతా విలువలు, సోదరభావాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యుల పట్ల ప్రేమాభిమానాలు చూపుతూ, సమాజ అభివృద్ధి కోసం అందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని సూచించారు. పరమశివుని కృపాకటాక్షాలతో ప్రతి ఇంటా శాంతి, సిరిసంపదలు నిండాలని, శివకేశవుల ఆశీస్సులు ప్రజలపై మరియు జనం న్యూస్ కుటుంబ సభ్యులందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు.