
జనం న్యూస్ 25 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్కాం గ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీల సాధనే లక్ష్యంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పోతురాజు సుధీర్ చేపట్టిన కోస్గి టు కొడంగల్ చేపట్టిన 25 కిలో మీటర్ల పాదయాత్రకు తెలంగాణ రక్షణ సేన పార్టీ కొడంగల్ ఇన్చార్జి కర్ణం రాజ ప్రభాకర్ అనుచరుల పార్టీ శ్రేణుల సంపూర్ణ మద్దతు పాదయాత్రను ప్రారంభించి సంఘీభావం ప్రకటించిన తెలంగాణ రక్షణ సేన నాయకులు కార్తీక పౌర్ణమి నుంచే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది పలుకుతాం అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూల్చేంతవరకు మా పోరాటం ఆగబోదని స్పష్టం చేసిన బి వి యచ్చ్ పి యస్ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలోని నారాయణపేట జిల్లా కోస్గి మండలం నుంచి వికారాబాద్ జిల్లా కొడంగల్ వరకు వికలాంగులకు ఇచ్చిన ఎన్నికల హామీల సాధన కోసం పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా గిద్దె రాజేష్ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను మూడేళ్లు గడిచినా అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూల్చేంతవరకు తమ పోరాటం, పాదయాత్ర ఆగబోదని స్పష్టం చేశారు. కార్తీక పౌర్ణమి అయిన ఈరోజు నుంచే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది పలుకుతామని హెచ్చరించారు. ఎన్నికల ముందు వికలాంగుల ఓట్ల కోసం ఆకర్షణీయమైన హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించడం ఏ విధమైన పాలన అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ పాదయాత్రతోనైనా ముఖ్యమంత్రి స్పందించి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన ప్రధాన హామీలైన నెలకు రూ.6,000 పెన్షన్, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్సుల్లో 100 శాతం ఉచిత ప్రయాణ సౌకర్యం, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ, వికలాంగుల కోసం ప్రత్యేక సంక్షేమ శాఖ ఏర్పాటు, ప్రతి జిల్లా కేంద్రంలో వికలాంగుల కాలనీలు, హాస్టళ్ల నిర్మాణం వంటి హామీలను వెంటనే అమలు చేయాలని గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. డిసెంబర్ 3లోగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చకపోతే గిద్దె రాజేష్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ పాదయాత్రకు తెలంగాణ రక్షణ సేన కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి రాజా ప్రభాకర్ గారి ఆదేశానుసారం ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మద్దతు ప్రకటించి పాల్గొన్నారు. వారిలో తనిష్క, దేవ్ సింగ్ నాయక్, అనిల్ నాయక్, గణేష్ నాయక్, ఎండీ నవాజ్, నవాజ్, పి. వెంకటప్ప, రాము, వెంకటప్ప, పద్మ, శ్రీనివాస్, రమేష్, సాయి కుమార్, అంజి తదితరులు ఉన్నారు. అలాగే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వికారాబాద్ జిల్లా కార్యదర్శి తోకని వెంకటేష్, మండల అధ్యక్షులు కురువ ఆంజనేయులు, రాయప్ప, రాములు, మలకయ్య, రంగాచారి, లక్ష్మయ్య తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.